ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఎట్టకేలకు అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ కి ఫుల్ స్టాప్ పడి పోయింది అని అనుకునే లోపే మళ్ళీ స్టార్ట్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా దానికి కారణం కూడా బన్నీనే అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మనకు తెలిసిందే సంక్రాంతి బరిలో ఈసారి బడా బడా సినిమాలు రేస్ లో నిలిచాయి. మరీ ముఖ్యంగా  మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ 'గేమ్ చేంజర్ ' సినిమాతో జనవరి 10వ తేదీ జనాలను పలకరించారు .


సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకుంది . ఆ తర్వాత బాలయ్య నటించిన 'డాకు మహారాజ్ ' సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . ఆ తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం  సినిమాలు  సూపర్ సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో ఇప్పుడు థియేటర్స్ మొత్తం డాకు మహారాజ్ అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల సందడితో కలకలాడిపోతున్నాయి .



గేమ్ చేంజర్ మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ అందుకుంటుంది . కాగా  'డాకు మహారాజ్ ' సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ స్పెషల్ గా విష్ చేశాడు. అది కూడా ఫ్రెష్ డిఫరెంట్ ఫ్లవర్ బొకేని పంపించి 'డాకు  మహారాజ్ టీం " కి స్పెషల్గా కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెప్పారు.  ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయినట్లయింది. అయితే రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్ ' సినిమాపై ఏ విధంగా స్పందించలేదు అల్లు అర్జున్ అని ..కానీ డాకుమహారాజ్  సినిమాకి మాత్రం ఇలా స్పెషల్ గా బొకే పంపించారు అని.. అల్లు అర్జున్ ఇంకా మారలేదు అని ..మెగా ఫ్యామిలీపై ఆ కోపం అలానే పెట్టుకొని ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో మరొకసారి ఫాన్స్ మధ్య హీట్ పెంచేసినట్లయింది. మెగా వర్సెస్ అల్లు వార్ మళ్ళీ స్టార్ట్ అయినట్లయింది..!





మరింత సమాచారం తెలుసుకోండి: