మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాల లో ముఠా మేస్త్రి సినిమా ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా మీనా , రోజా నటించగా ... కోదండ రామి రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు . ఇకపోతే ఈ మూవీ లో చిరంజీవి తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ మూవీ లో మీనా , రోజా తమ నటనలతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా 1993 వ సంవత్సరం జనవరి 17 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 32 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 32 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.

స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలను సంక్రాంతి పండక్కు విడుదల చేస్తూ ఉంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ముఠా మేస్త్రి మూవీ ని కూడా 1993 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మేకర్స్ భావించారు. అందుకు అనుగుణంగా అన్ని పనులను ముగిస్తూ వచ్చారు. ఇక చివరగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి జరగలేదు. దానితో ఈ మూవీ ని 1993 వ సంవత్సరం సంక్రాంతి పండక్కు మేకర్స్ విడుదల చేయలేకపోయారు. కానీ ఆ తర్వాత చాలా తక్కువ రోజులకు అనగా జనవరి 17 వ తేదీన ఈ మూవీ ని థియేటర్లలో విడుదల చేశారు. సంక్రాంతి పండక్కు విడుదల కాకపోయినా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: