మీనాక్షి చౌదరిబ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అభిమానులను అలరించింది. అనంతరం హిట్-2 సినిమాతో పాటు వరుసగా క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది. ఓ పక్క యంగ్ హీరోల సరసన నటిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం, దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది. 

కోలీవుడ్ లో దళపతి విజయ్ తో కలిసి నటించిన మీనాక్షి చౌదరి లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో మీనాక్షి పేరు వార్తల్లో నిలుస్తోంది. మీనాక్షి కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను కూడా చేస్తూ వస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఎక్స్ లవర్ పాత్రలో మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించింది.


ఈ సినిమాతో మీనాక్షి చౌదరి వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలోను మీనాక్షి చౌదరి అవకాశాన్ని అందుకుంది. అయితే గుంటూరు కారం, సంక్రాంతి వస్తున్నాం లాంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా చేసినప్పటికీ సక్సెస్ గా ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. భవిష్యత్తులో కూడా సెకండ్ హీరోయిన్ గానే చేసే అవకాశాలు ఉన్నాయట. సెకండ్ హీరోయిన్ గా చేసినప్పటికీ మీనాక్షి చౌదరి రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటుంది.

ఒక్కో సినిమాలో నటించినందుకు రూ. 2 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కాగా, మీనాక్షి చౌదరి గత సంవత్సరం వరుసగా సినిమాలలో నటించి మంచి అవకాశాలను అందుకుంది. ఇక 2025 ప్రారంభంలోనే మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చేతిలో వరుసగా సినిమా అవకాశాలతో ఈ అమ్మడు బిజీగా ఉంది. ఇక 2025 మరో మూడు సినిమాలు చేయనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: