మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా ... జగపతి బాబు , ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లోని చరణ్ నటనకు విమర్శకుల నుండి , ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను సుకుమార్ కు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే రంగస్థలం లాంటి అద్భుతమైన విజయం తర్వాత ఈ కాంబోలో మరో మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కకపోయే సినిమాలో చరణ్ హీరోగా నటించబోతున్నాడు. ఇకపోతే తాజాగా సుకుమార్ "పుష్ప 2" సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇప్పటికి కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఇప్పటి నుండే సుకుమార్ , రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చరణ్ తో సినిమాలో శ్రీలీలను స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలి అనే ఆలోచనలో కూడా సుకుమార్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీలో కూడా శ్రీ లీల స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: