టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో అంజలి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల ద్వారా కెరీర్ను మొదలు పెట్టిన ఇక్కడ ఈమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో తమిళ్ సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు తమిళ్ లో మంచి అవకాశాలు రావడం , అలాగే మంచి విజయాలు దక్కడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత అంజలి మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించింది.

మూవీ మంచి విజయం సాధించడం వల్ల ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక అప్పటి నుండి ఈమె తెలుగులో చాలా క్రేజీ సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈమె చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన విజయాలు మాత్రం ఈ బ్యూటీకి దక్కలేదు. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన గీతాంజలి మూవీ కి కొనసాగింపుగా రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా రూపొందున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఈ బ్యూటీ ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది.

తాజాగా ఈమె , రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో నటించింది. భారీ అంచనాల నడప విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడడం లేదు. ఇలా ఈ మధ్య కాలంలో అంజలి చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన సక్సెస్ను మాత్రం అందుకోవడంలో విఫలం అయింది అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: