కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్ ని స్టార్ హీరోయిన్స్ దాదాపుగా చేసేవారు కాదు. కానీ ప్రస్తుతం కాలం మారింది. అద్భుతమైన స్టార్ ఈమేజ్ కలిగిన హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ వస్తున్నారు. ఇకపోతే స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్న కొంతమంది స్పెషల్ సాంగ్స్ లలో నటించిన కేవలం ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ తో ఆపేసిన బ్యూటీలు కూడా కొంత మంది ఉన్నారు. వారు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

అనుష్క : తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో ఈ బ్యూటీ చిరంజీవి హీరో గా రూపొందిన స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన గుర్తింపు వచ్చిన ఆ తర్వాత ఈమె ఇప్పటి వరకు తన కెరియర్ లో వేరే ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు.

కాజల్ అగర్వాల్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈ ముద్దు గుమ్మ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే కాజల్ చేసిన ఈ మూవీ లోని సాంగ్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ మూవీ తర్వాత ఈమె ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు.

సమంత : తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ లోని సమంత చేసిన స్పెషల్ సాంగ్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయిన కూడా ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న సమంత ఇప్పటి వరకు వేరే ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: