ఇక బాలకృష్ణ టాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు .. అయితే బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించాయి .. కాగా ఇప్పుడు ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం . బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్ చరిత్రలోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకొని ప్రపంచవ్యాప్తంగా రూ. 133 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . ఆ తర్వాత గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి మూవీ కూడా బాలయ్యకు మంచి హిట్ ఇచ్చింది ..
ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర రూ. 134 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన భగవంత్ కేసరి కూడాా బాక్సాఫీస్ దగ్గర రూ. 132 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది .. ఇక ఇప్పుడు తాజాగా ఈ 2025 సంక్రాంతికి బాలకృష్ణ హీరో గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే .