ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలతో కోలీవుడ్ డైరెక్టర్లు సినిమాలను ఎక్కువ శాతం తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రీసెంట్ టైం లో కోలీవుడ్ డైరెక్టర్లు టాలీవుడ్ హీరోలతో ఇంగ్లీష్ టైటిల్స్ తో సినిమాలను రూపొందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ సినిమాలు మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి లింగు స్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే టైటిల్ తో రూపొందిన సినిమాలో హీరో గా నటించాడు. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. చరణ్ ఈ మూవీ లో రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ చరణ్ ఈ మూవీ లో నటించాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్ కి జోడిగా అంజలి నటించగా , కొడుకు పాత్రలో నటించిన చరణ్ కి జోడి గా కియార అద్వానీ నటించింది. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది  అలా ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలతో తమిళ దర్శకులు ఇంగ్లీష్ టైటిల్స్ తో ఈ రెండు మూవీ లను రూపొందించగా ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: