మెగాస్టార్ చిరంజీవి , దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా కొన్ని సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కూడా అయ్యాయి. ఇంత గొప్ప కాంబినేషన్లో ఓ సినిమా ఆల్మోస్ట్ సెట్ అయిన తర్వాత రాఘవేంద్రరావు మాత్రం ఆ సినిమాలో చిరును కాకుండా వేరే హీరోని తీసుకొని సినిమా చేశారట. ఆ సినిమా ఏది ..? రాఘవేందర్రావు ఎందుకు చిరంజీవిని ఆ సినిమా విషయంలో పక్కన పెట్టాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు ... మోహన్ బాబు హీరోగా శోభన హీరోయిన్గా అల్లుడు గారు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కథ మొత్తం పూర్తి కాక ముందు రాఘవేందర్రావు ఆ స్టోరీతో చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవితో ఒక కథ రాస్తున్నాను అని కొంత భాగాన్ని కూడా చిరంజీవికి వినిపించగా ఆయనకు కూడా అది అద్భుతంగా నచ్చడంతో కచ్చితంగా ఈ కథతో మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అని చిరంజీవి అన్నాడట. దానికి రాఘవేంద్రరావు కూడా ఓకే అన్నాడట. ఇక కొన్ని రోజుల తర్వాత రాఘవేందర్రావు ఒక సారి చిరంజీవిని కలిసి నీతో చేయాలి అనుకున్న కథతో వేరే హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నాను అని అన్నాడంట.

దానితో ఎందుకు సార్ అని రాఘవేందర్రావు ను చిరంజీవి అడిగాడట. దానితో రాఘవేంద్రరావు ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోయే సన్నివేశం వస్తుంది. నీలాంటి స్టార్ ఈమేజ్ కలిగిన నటుడు చనిపోతాడు అంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాను వేరే హీరోతో చేస్తారు అని చిరంజీవితో అన్నాడట. దానికి చిరంజీవి కూడా ఓకే చెప్పాడట. అలా మొదట చిరంజీవితో చేయాలి అనుకున్నా రాఘవేంద్రరావు ఆ తర్వాత ఈ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత మోహన్ బాబుతో ఈ సినిమా పర్ఫెక్ట్ అని ఆయనతో రూపొందించాడట. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: