అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి సీజన్‌లో క్లీన్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది.అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు బాగా నటించారు.. దర్శకుడు అనీల్ రావిపూడి బాగా తీశాడు. కానీ.. వీళ్లకంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురించే.. అతనే బుల్లిరాజు. ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ.. గొల్లున నవ్వడానికి రెడీగా ఉండల్రోయ్ అనేట్టు చేశాడు. ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారనే చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు. బుల్లిరాజు కనిపిస్తే చాలు.. ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వులు వెల్లువిరిసేలా చేశారు.ఇదిలావుండగా
రవితేజ నటించిన వెంకీ సినిమాలో ని ట్రైన్ సీన్ అందరికీ గుర్తుండేవుంటుంది. ఆ ట్రైన్ సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన భరత్ గురించి ప్రేత్యేకంగా చేరప్పనవసరం లేదు. సినిమాల్లో మాస్టర్ భరత్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ముఖ్యంగా శ్రీనువైట్ల సినిమాల్లో భరత్ చేసిన కామెడీ సూపర్. ఇప్పటికి ఆ సీన్లు మీమ్స్ రూపంలో సోషల్ మీడియా లో దర్శనమిస్తూ ఉంటాయి.ఈ క్రమంలో నే సంక్రాంతి కి వస్తున్నాం మూవీ లోని బుడ్డోడు బుల్లిరాజు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.ప్రేక్షకులు ఈ బుడ్డోడి కామెడీ టైమింగ్ కి ఫిదా అవుతున్నారు.ముందు ముందు భవిష్యత్తు సినిమాల్లో ఈ బుడ్డోడు భరత్ స్థానాన్ని భర్తీ చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమాలో అయితే ఫన్ రైడ్ చూపించాడు బుల్లిరాజు. అన్నట్టు అనీల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితోనట. ఆ సినిమాలో కూడా ఈ బుడ్డోడికి మంచి క్యారెక్టర్ ఉండబోతుందట. ఆ తరువాత కూడా బుడ్డోడికి తిరుగు ఉండదు. ఎందుకంటే బుల్లిరాజు పాత్రతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడుమరి.

మరింత సమాచారం తెలుసుకోండి: