ఇక మన చిత్ర పరిశ్రమ లో చాలామంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా మాయమైపోతూఉంటారు .. హీరోయిన్గా చేసింది కొన్ని సినిమాల అయినా కూడా తమ మార్క్ ని చిత్ర పరిశ్రమలో వదిలి వెళుతూ ఉంటారు కొందరు .. ఒకటి రెండు సినిమాలు తోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైపోతారు .. అలాంటి హీరోయిన్లలో ఇప్పుడు చెప్పబోయే ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు .. ఇంతకీ పైన ఫోటోను గమనించారా ? ఇక అందులో ఎన్టీఆర్ పక్కన నిలబడి ఉన్న ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా ? ఆ సినిమా ఏంటో గుర్తుకు వచ్చిందా ? ఈ హీరోయిన్ పేరు మంజరి ఫెడ్నస్ .. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమాలో ఈమె నటించిన .. అంతకన్నా ముందు అల్లరి నరేష్ హీరోగా వచ్చిన  సిద్దూ ఫ్రేం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.
 

ఆ తర్వాత మరోసారి అల్లరి నరేష్ హీరోగా వచ్చిన శుభప్రదం అనే సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ .. ఈ రెండు సినిమాల్లో తన అందం అబినయంతో ప్రేక్షకులను  కట్టిపడేసింది .. అయితే మంజరికి సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు .. శుభప్రదం సినిమాలో తన నటనతో నటిగా గొప్ప ప్రశంసలు అందుకున్న మంజరీకి ఆ తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలు అయితే దక్కలేదు .. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది .. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోని భారీ డిజాస్టర్ గా మిగిలింది .. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎన్టీఆర్ భార్యాగా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మంజరికి అసలు గుర్తింపు రాలేదు.

 

ఇక దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది .. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది .. మరాఠీ , హిందీలో ఎక్కువ సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ అటు వెబ్ సిరీస్ లు సైతం చేసింది .. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ .. వరుసగా హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది ... ఒకప్పుడు ఎంతో పద్ధతిగా బొద్దుగా కనిపించిన మంజరి ఇప్పుడు .. నాజుగా గ్లామర్ లుక్ లో డస్కీ బ్యూటీగా హాట్ హాట్ ఫోటోలతో సోష‌ల్‌ మీడియాలోనే హిట్ పెంచేస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: