లైఫ్ స్టైల్ ఆసియా రిపోర్ట్ ప్రకారం .. సైఫ్ అలీ ఖాన్ అతని భార్య కరీనా కపూర్ బాంద్రాలోని సద్గురు శరన్ అపార్ట్మెంట్స్ లో ఖాన్ కుటుంబంతో కలిసి ఉంటున్నారు .. ఈ ఇంటిని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ దర్శిని షా డిజైన్ చేశారు . సైఫ్ అలీ ఖాన్ ఉండే భవనంలో 3BHK ఫ్లాట్ ధర 10 కోట్ల కంటే ఎక్కువ. ఇక సైఫ్ అపాయింట్మెంట్ ధర 55 కోట్లు .. అలాగే సైఫ్ అలీ ఖాన్ అపార్ట్మెంట్‌కు 24 గంటల భద్రత ఉంటుంది .. ప్రతిచోట సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి . ఎలాంటి అనుమతి లేకుండా సైఫ్ ఇంట్లోకి ఎవరూ రాలేరు .. అలాగే కొన్ని నివేదికల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ కుటుంబం భద్రత కోసం లక్షల్లో ఖర్చు చేస్తారు . అలాగే వీరికి ప్రైవేట్ బాడీగార్డ్స్ కూడా ఉన్నారు .. కానీ ఇప్పుడు సైఫ్ సెక్యూరిటీ సిబ్బందిపై అనేక అనుమానాలు ప్రశ్నలు బయటికి వస్తున్నాయి.
అలాగే బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో తన పర్సనల్ బాడీగార్డ్ కు ఏకంగా రెండు కోట్లకు పైగా జీతం ఇస్తున్నాడు .. ఇంతకీ అతను ఎవరంటే.. మరి ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ .. రవి సింగ్ గత ఐదు సంవత్సరాలుగా షారుక్ ఖాన్ బాడీగార్డ్ .. అతనికి 2.7 కోట్లు జీతం ఇస్తున్నారు . మన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న బాడీగార్డ్ కూడా ఇతనే .. గుర్మీత్ సింగ్ జాలీ అకా షేరా 1995 నుండి సల్మాన్ ఖాన్ బాడీగార్డ్. అతడికి రూ.2 కోట్ల జీతం. యువరాజ్ ఘోర్పడే అమీర్ ఖాన్ సెక్యూరిటీ గార్డు. ఆయనకు 2 కోట్ల ప్యాకేజీ కూడా ఉంది. పోలీస్ కానిస్టేబుల్ జితేంద్ర షిండే 2015, 2021 మధ్య అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డ్‌గా పనిచేశాడు. అతడికి రూ.1.5 ప్యాకేజీకి ఉంది. ఇలా ఇన్ని కోట్లు తమ సెక్యూరిటీ కోసం ధారపోస్తున్న బాలీవుడ్ హీరోల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది .