కాటుక దిద్దిన తేనెకల్లు డస్కీస్కి ఎంతో అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో చూడచక్కని అందంతో అందర్నీ ఇట్టే కట్టిపడేస్తుంది .. ఇంతకి ఆ అమ్మాయి హీరోయిన్ కూడా కాదు .. బడ వ్యాపారవేత్త కూడా కాదు .. ఆ అమ్మాయి ఈ కుంభమేళాలో దండలు అమ్ముకునే ఓ సాధారణ మహిళ .. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ గా మారిపోయింది .. ఇండోర్ కు చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు ఊహించిని విధంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .. ఇక ఆమెకు సంబంధించిన వీడియోలు ఫోటోలకు నెటిజన్లను ఫిదా అవుతున్నారు.
ఇక ఆ అమ్మాయి పేరు మోనాలిసా అని తెలుస్తుంది .. ఆమె అందమైన రూపానికి చిరునవ్వుకు కుంభమేళాకు వచ్చిన జనాలు కూడా ఎంతో ఫిద అవుతున్నారు .. ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె సహజ సౌందర్యం అద్భుతమైన అందం అంటూ కామెంట్లు పెడుతున్నారు .. మరీ ముఖ్యంగా ఆమె కళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి అంటున్నారు .. అలాగే సోషల్ మీడియాలో కొందరు ఆమెను పెళ్లి చేసుకున్నారా అని కూడా అడుగుతున్నారు . దానికి లేదు అని కూడా ఆన్సర్ ఇచ్చింది .. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా అని మరో వ్యక్తి అడగాా .. మా తల్లిదండ్రులు తీసుకొచ్చిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది .. ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మరీ రాబోయే రోజుల్లో ఈ కుంభమేళా అమ్మాయి హీరోయిన్గా సినిమాల్లో నటించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.