‘పుష్ప 2’ రికార్డుల మోత ఈవిధంగా కొనసాగుతూ ఉంటే ఈమూవీలో సుకుమార్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ పాత్ర పై విమర్శలు రావడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక స్మగ్లర్ ను హీరోగా మార్చి ఒక భారీ సినిమాను తీసిన సుకుమార్ ఈసమాజానికి ఏమి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు అంటూ అతడి పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరికొందరైతే ఒక స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఇస్తారా అంటూ విమర్శలు కూడ చేశారు. ఈ విమర్శలు అన్నింటికీ సుకుమార్ తన నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాంధీ తాత చెట్టు’ మూవీతో సమాధానం ఇవ్వబోతున్నాడు. సుకుమార్ కూతురు సుకృతి నటించిన ఈమూవీ ఫిబ్రవరి 24న విడుదల కాబోతోంది.
రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం చేస్తున్న గాంధీ తాత చెట్టు ఫిబ్రవరి 24 థియేటర్లలో విడుదల కానుంది. సుకుమార్ సతీమణి తబిత సమర్పుకురాలిగా నిర్మాణం జరుపుకున్న ఈ మూవీలో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది అంటున్నారు. ఈ మూవీలో నటించిన సుకృతి పాత్ర సహజత్వం కోసం తన 15 సంవత్సరాల కూతురు వద్దంటున్నా ఆమెకు గుండు గీయించి ఈమూవీలో సహజత్వం కోసం సుకుమార్ తీసుకున్న జాగ్రత్తలను అతడి భార్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. విడుదలకు ముందే ఈసినిమాకు అనేక అవార్డులు రావడం సంచలనంగా మారింది..