ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు వరసగా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ డబల్ హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మహాకుంభమేళకు అనేకమంది నాగసాధువులు అఘోరాలు వస్తున్నారు. సాధారణంగా హిమాలయ ప్రాంతంలో మాత్రమే కనిపించే వీరు ఈ మహాకుంభమేళ కోసం నడుచుకుంటూ ప్రయాగ వచ్చిన విషయం తెలిసిందే
వేలాది సంఖ్యలో కనిపిస్తున్న అఘోరా లను చూసి ఈ కుంభమేళాను కవరు చేస్తున్న ప్రపంచ మీడియా సంస్థ ప్రతినిధులు ఆశ్చర్య పోతున్నారు. ఇప్పుడు ఆశాన్నివేశాలు అన్నీ దసరా కు రాభోతున్న ‘అఖండ 2లో కనిపించబోతున్నాయి. ఇప్పటికే బోయపాటి తన యూనిట్ సభ్యులతో కలిసి కుంభమేళాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ‘అఖండ 2’ లో ప్రేక్షకులకు చూపెడతాడని తెలుస్తోంది. జరుగుతున్న ఈ మహాయకుంభమేళాకు దేశ జనాభాలో 25 శాతానికి పైగా పాల్గొంటారని ఒక అంచనా వస్తోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు ‘అఖండ 2’ కథ మొత్తం పెద్ద బాలయ్య చుట్టూ తిరుగుతుందనే లీకులు వస్తున్నాయి. దుష్టశక్తులను అంతమొందించేందుకు అపారమైన దివ్య శక్తులను ప్రోగు చేసుకునే క్రమంలో పెద్ద బాలయ్య పోషిస్తున్న ‘అఖండ’ పాత్ర కోసం కీలకమైన ఈ మహాకుంభమేళా సన్నివేశాలు చూపెడతారని తెలుస్తోంది. ‘సింహా’ ‘లెజెండ్’, ‘అఖండల’ తరువాత తీయబోతున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్చేసే విధంగా బోయపాటి భారీ బడ్జెట్ తో తీస్తున్న విషయం తెలిసిందే..