కానీ అల్లు అర్జున్ మాత్రం సైలెంట్గా అన్ని చూస్తూ బరిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది.. ఆ టైం వచ్చాక నేనేంటో చూపిస్తాను.. అన్న రేంజ్ లోనే అల్లు అర్జున్ సైలెంట్ గా తనపని తాను చేసుకో పోయాడు . కాగా రీసెంట్గా అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు ఇతర దేశాలలో కూడా రిలీజ్ అవుతున్నాయి . చైనాలో ఇతర దేశాల సినిమాలు వంతులు వారిగా విడుదలవుతూ సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్నాయి . మరి ముఖ్యంగా ప్రజెంట్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా అక్కడ ఎంత హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే.
ఇప్పటికి థియేటర్స్ లో ఆడుతూనే ఉంది . అయితే ఇప్పుడు పుష్ప2 సినిమాను అక్కడ రిలీజ్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట మూవీ టీం. ఎర్రచందనం అంటే చైనీయులకు చాలా చాలా పవిత్రమైనది . ఆ కారణంగానే ఎర్రచందనంతో ముడిపడిన ఈ కథను అక్కడ రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా ని చైనాలో రిలీజ్ చేస్తే సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట . ప్రజెంట్ అదే పనిలో బిజీగా ఉన్నారు పుష్ప 2 టీమ్ అంటూ తెలుస్తుంది .
అయితే అల్లు అర్జున్ కెరీర్ ని పుష్ప 2 సినిమా ఎంత హైపు తీసుకెళ్లిందో పర్సనల్ లైఫ్ అంత దారుణంగా ట్రోల్ అయ్యేలా కూడా చేసింది . అయితే అల్లు అర్జున్ వద్దకు వెళ్లి పుష్ప2 సినిమా గురించి చెప్పగానే అల్లు అర్జున్ ఏం మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసారట . ఇంత ఇష్యూ జరిగాక అసలు సినిమా ప్రమోషన్స్ కి రాను ..ఈ సినిమాతో నాకు సంబంధం లేదు అంటూ చెప్పేస్తాడు అల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ భావించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమా కోసం ఏమైనా చేస్తాడు . ఆ కారణంగానే సినిమా చైనాలో కూడా రిలీజ్ చేయండి అంటూ ఓకే చెప్పారట . సినిమా ప్రమోషన్స్ కి డైరెక్ట్ గా అటెండ్ కాకపోయినా విజువల్ గా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటాను అంటూ హామీ కూడా ఇచ్చారట . దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు..!