బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్  మూవీలో కీలకపాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో బాలకృష్ణతో కలిసి దబిడి దిబిడే అనే సాంగ్ లో కూడా చేసింది.ఇక ఈ సాంగ్ పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో కూడా బాలకృష్ణ ఊర్వశీ రౌటేలా ప్రైవేట్ పార్ట్ వైపు చేతులు చూపిస్తూ చేసిన డ్యాన్స్ చాలా అసభ్యంగా ఉండడంతో పాటు వివాదాస్పదంగా ఉంది అని చాలామంది నెటిజెన్లు బాలకృష్ణనీ తిట్టిపోసారు. అయితే అలాంటి ఊర్వశి రౌటేల తాజాగా  మరో వివాదంలో ఇరుక్కున్నట్టయింది.ఇంతకీ ఊర్వశి రౌటేలా చేసిన తప్పేంటయ్యా అంటే..తాజాగా సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆయన ఇంట్లోకి దొంగ చొరబడి డబ్బు కోసం వచ్చినప్పటికీ డబ్బు ఇవ్వకపోవడంతో సైఫ్ పై దాడి చేశారు.

అయితే ఈ విషయంపై చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్ త్వరగా ఆ గాయం నుండి కోలుకొని బయటపడాలని ఆయనకు మద్దతు తెలిపారు.అలాగే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. అయితే బాలీవుడ్ మొత్తం ఆ మంత్రం జపిస్తుంటే తాజాగా ఊర్వశి రౌటేలా ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ సినిమా సక్సెస్ అయ్యాక నాకు మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ మా అమ్మ ఖరీదైన డైమండ్ రింగుని బహుమతిగా ఇచ్చింది. కానీ వాటిని పెట్టుకొని బయటికి వెళ్లాలంటే నాకు భయంగా ఉం.ది ఎందుకంటే సైఫ్ లాగే నాపై కూడా ఎవరైనా దాడి చేస్తారని... అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను అంటూ చెప్పింది. అయితే ఊర్వశి మాటలపై చాలామంది నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు.

బాలీవుడ్ మొత్తం ఆయన త్వరగా కోలుకోవాలని అంటుంటే నువ్వేమో నీ రింగు వాచ్ గురించి గోప్పలు  చెప్పుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ కామెంట్లు ఊర్వశి  దాకా చేరడంతో తాజాగా దీనిపై స్పందించిన ఊర్వశి సైఫ్ అలీ ఖాన్ కి నేను క్షమాపణలు చెబుతున్నాను. డాకు మహారాజ్ సినిమా సక్సెస్ లో ఉండి నేను ఏం మాట్లాడుతున్నానో గ్రహించలేకపోయాను.. ఆ ఇంటర్వ్యూలో అనుచితంగా మాట్లాడినందుకు సైఫ్ అలీ ఖాన్ కి క్షమాపణలు చెబుతున్నాను. మీ మీద జరిగిన దాడి గురించి నాకు తెలియదు.కానీ మీ మీద జరిగిన దాడి తీవ్రత గురించి తెలిసి సిగ్గుపడుతున్నాను అంటూ సైఫ్ అలీ ఖాన్ కి క్షమాపణలు చెప్పింది.దీంతో ఈ వివాదం ఆగిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: