ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు.. వినిపించలేదు. గతంలో హీరోయిన్ సమంత పేరు ఎంతలా మారుమ్రోగిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. కానీ రీసెంట్ గా మాత్రం హీరోయిన్ సమంత పేరు అంతగా జనాలు పట్టించుకోవడం లేదు. అయితే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం.. శోభిత ధూళిపాళ్ల పేరు హైలెట్ గా మారడం.. సమంత పెద్దగా సినిమా అవకాశాలను ఓకే చేయలేకపోవడం కూడా ఇందుకు కారణం . కాగా తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది . ఆ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవడానికి సమంత రకరకాల వ్యాయామాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . 


అయితే తాజాగా తన అభిమానులు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసింది సమంత . తన మాటలతో రకరకాల వర్కౌట్లు చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది . ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. "ఈ కొత్త సంవత్సరం మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో కొంచెం వెనకబడ్డారా.. డిఫికల్ట్ గా  ఉందా..? ప్రస్తుతం నేను కూడా అదే సిచువేషన్ ఫేస్ చేస్తున్నాను.. అయితే నాకు ఇలా చాలాసార్లు ఇలా జరిగింది".



"గడ్డు రోజులు చవిచూసినంత మాత్రాన మనం ఓడిపోయినట్లు కాదు కదా.  కొన్నిసార్లు కావాలనే మనల్ని మనమే విరామం తీసుకునేలా చేస్తూ ఉంటారు.  కొన్ని సందర్భాలలో మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. నాకెంతో ఉపయోగపడిన ఫిట్నెస్ పద్ధతులని విషయాలని మీకు కూడా వివరిస్తాను . ఆలోచన పక్కన పెట్టి అన్ని రకాల వర్కౌట్ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా నిదానంగా చేసుకుందాం. అప్పుడు మనం అనుకున్న ఫలితాలను ఈజీగా రాబట్ట గలము" అంటూ చెప్పుకొచ్చింది . సమంత వీడియో చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది అంటున్నారు జనాలు . సమంత పై విడాకుల తర్వాత ఫస్ట్ టైం ఒక పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉండడంతో సమంత పేరు మరొకసారి ఇంటర్నెట్లో మారుమ్రోగిపోతుంది..!





మరింత సమాచారం తెలుసుకోండి: