దర్శకుడు కాశీ విశ్వనాథ్ రాసుకున్న ఓ లవ్ స్టోరీకి మహేష్ బాబు హీరోగా బాగుంటారని నిర్మాత సురేష్ బాబు సూచించారట .. కానీ ఆ ప్రతిపాదనను ఆయన సున్నితంగా నో చెప్పారట. తాను రాసుకున్న ఈ అందమైన ప్రేమ కథ కోసం గతంలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ హీరోగా ఎంచుకున్నారు దర్శకుడు కాశీ విశ్వనాథ్ .. ఇంతకీ ఆ సినిమా ఏంటో అనుకుంటున్నారా ..? అదే నువ్వు లేక నేను లేను .. మహేష్ బాబుతో ఈ సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు ఎప్పుడు క్యూలో ఉంటారు .. ఆయన డేట్స్ దొరకటం కష్టం ఇప్పటికే నాకు చాలా లేట్ అయింది ఈ కథకు తరుణ్ హీరోగా సరిపోతారు ..
అలా తరుణ్ హీరోగా పెట్టి నువ్వు లేక నేను లేను సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు నిర్మాత సురేష్ బాబు దర్శకుడు కాశీ విశ్వనాథ్ .. 2002 జనవరి 14న విడుదలైన నువ్వే లేక నేను లేను సినిమా భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో తరుణ్ కు జంటగా హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ నటించింది .. వీరిద్దరి జంటకు ప్రేక్షకులు ఎంతగానో ఫీదా అయ్యారు . అలాగే ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ కూడా ఎంతో హైలైట్ అయింది . ఈ సినిమా తర్వాత తరుణ్ కు టాలీవుడ్ లో మరింత క్రేజ్ వచ్చింది ..అయితే ఇప్పుడు ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నా విషయం తెలిసిందే ..ఈ సినిమాతో రాజమౌళి మహేష్ కు ఎలాంటి స్టార్‌డమ్ అందిస్తారో చూడాలి.