గడిచిన కొద్ది రోజుల క్రితం మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ నటించిన బరోజ్ 3D చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఒక డ్రీమ్ ప్రాజెక్టు అనేట్టుగా మొదటిసారి ఒక విభిన్నమైన పాత్రలో నటించారు మోహన్లాల్. ఈ చిత్రాన్ని ఆయనే దర్శకత్వం వహించారు.ఇఈ చిత్రాన్ని కూడా ఎంత ఎన్నో  ఐడియాలతో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఎన్నో సవాళ్లతో సమర్థవంతంగా ఎదుర్కొని పూర్తి చేసి విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆశీర్వాద సినిమా బ్యానర్ వారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందట.



మోహన్లాల్ అడిగిన ప్రతిదీ కూడా క్షణాలలో సమకూర్చే అంతగా ఈ చిత్రానికి కోసం ఆశీర్వాద్ బ్యానర్ కష్టపడ్డారు. బెస్ట్ క్వాలిటీ పిక్చర్స్ అందించడం కోసం నిర్మాతలు ఎక్కడా కూడా రాజీ పడలేదట. మొత్తానికి సెన్సార్ కాపీ పూర్తి అయ్యి మొదటి రోజు రావడానికి 150 కోట్ల రూపాయలు ఖర్చయిందట. ఈ సినిమా విడుదల అయ్యి లాంగ్ రన్ టైంలో 20 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఎంతటి దారుణమైన వైఫల్యాన్ని ఎదుర్కొన్న చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకు మోహన్ లాల్ కెరియర్ లోనే ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తీయలేదట.


అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి  కూడా కేవలం 20 కోట్లు రాబట్టడం అంటే ఎంత పెద్ద ఆపదో చెప్పాల్సిన పనిలేదు. మలయాళంలో పాటుగా సౌత్ లో కూడా చాలా భాషలను ఈ సినిమాను  రిలీజ్ చేశారు.. మోహన్లాల్ సినిమా కాబట్టి బడ్జెట్ని పూర్తిగా రికవరీ చేయలేకపోయినా కనీసం 100 కోట్లు లో పైన రిటర్న్ వస్తుందనుకున్నారు చిత్ర బృందం. కానీ సినిమా వైఫల్యం చాలా స్పష్టంగా కూడా కనిపిస్తున్నదట. ఈ సినిమా చూడకుండానే చాలామంది రివ్యూలు ఇవ్వడం వల్ల ఈ సినిమాకి దెబ్బ పడిందని అభిమానులతో పాటు మలయాళ నిర్మాతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నెగిటివ్ టాక్ గట్టిగానే స్ప్రెడ్ చేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ నిర్మాతలకు ఈ నష్టాన్ని బుడ్చాలంటే  అంటే కనీసం నాలుగైదు సినిమాలైన ఆ బ్యానర్ మీద చేయాల్సి ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: