సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది .. జనవరి నెలకు ఇంకో రెండు వారాలు మిగిలే ఉన్న పెద్ద సినిమాలు రిలీజ్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు .. ఇక దీంతో సినీ ప్రియుల అంతా ఇప్పుడు ఫిబ్రవరి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు .. వచ్చే ఫిబ్రవరి లో రెండు వారాల పాటు వరస రిలీజ్ లతో బాక్సాఫీస్ మళ్ళీ కళకళలాడబోతుంది . కొత్త   సంవత్సరాని కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో నాగచైతన్య , తండేల్ సినిమా తోమొదటిసారిగా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు ఈ అక్కినేని హీరో .


సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకులు ముందుకు  రానుంది .. అయితే అదే రోజు మరి ఏ సినిమా పోటీకి లేకపోవడం తండేల్ కు మరింత హెల్ప్ అవుతుందని అంటున్నారు . వాలెంటైన్స్ డే వీక్ మీద మాత్రం చాలా మంది హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .. నితిన్ తమ్ముడు , కిరణ్ అబ్బవరం దిల్‌రుబా , విశ్వక్‌సేన్ లైలా , బ్రహ్మా ఆనందం సినిమాలు ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రావడానికి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి .


అయితే వీటిలో కొన్ని సినిమాలు ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం తో ఈ లిస్టులో ఎన్ని ఫిబ్రవరి వార్‌లో ఉంటాయన్నది మరికొద్ది రోజుల్లో ఓ క్లారిటీ రానుంది .. రీసెంట్ గానే ప్రమోషన్స్ మొదలు పెట్టిన సందీప్ కిషన్ కూడా ఫిబ్రవరి లోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ  అవుతున్నారు ... ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మజాకా ఫిబ్రవరి 21 న రిలీజ్ కానుంది .  ఇలా జనవరి నెల ఇచ్చిన గ్యాప్ ను ఫిబ్రవరిలో ఫుల్ ఫిల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: