అలాగే ఈ సినిమాలు వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది .. ఈ సినిమాతో విజయ్ , రష్మిక జంటకు మంచి క్రేజ్ వచ్చింది. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది .. అలాగే మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది .. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి .. అయితే ఈ సినిమాలో రష్మిక కాకుండా మరో అమ్మాయి కూడా ఎంతో ఫేమస్ అయ్యింది .. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను ప్రేమించిన స్టూడెంట్ గా నటించిన అమ్మాయి గుర్తుండే ఉంటుంది ? ఆ ముద్దుగుమ్మ పేరు అనీషా దామా ..
ఇక ఈ సినిమాలో కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ నటనతో గ్లామర్ లుక్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. గీత గోవిందం తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించి అదరగొట్టింది .. అయితే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్న అనీషా . హీరోయిన్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది .. సత్తి గాని రెండెకరాలు సినిమాలో కూడా నటించింది .. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేక పోతుంది .. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ లేపుతుంది.