బాలయ్యకు ఒకలా చరణ్ కి మరొకలా మ్యూజిక్ ఇచ్చాడు అంటూ మండిపడ్డారు . కొన్ని విషయాలను మరీ పర్సనల్గా కూడా అటాక్ చేసే విధంగా కామెంట్స్ చేశారు . తమన్ ని చాలా దారుణంగా ట్రోల్ చేశారు . దీంతో ఎమోషనల్ గా స్పందించారు తమన్. రీసెంట్ గా జరిగిన 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ సెలబ్రేషన్ లో తమన్ స్పందించారు. " సక్సెస్ అనేది చాలా గొప్ప విషయం.. ఎంత డబ్బు పెట్టినా కూడా అది చాలా మందికి దొరకదు. ఎంతో కష్టపడాలి .. ఆ విజయం ఇచ్చే ఎనర్జీ ఎంత బాగుంటుందో మనం ముందుకు వెళ్లడానికి ఎంత సహాయపడుతుందో తెలుసు..కానీ ఆ రియల్ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. నాకు నిజంగా ఈ సక్సెస్ లేకపోతే ఫిలింనగర్ వైపు కూడా వెళ్లలేను ..అంత చిన్న చూపు చూస్తారు ..కాబట్టి ఎవరు ఎంత చేసినా సరే ఆ సక్సెస్ కోసమే.. ఓ ప్రొడ్యూసర్ విజయాన్ని అందుకుంటే గొప్పగా నిజంగా ధైర్యంగా బయటకు చెప్పుకోవాలని కూడా కష్టంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే నెగెటివిటీని అంతలా స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఇలా పనికిరానిక్ ట్రోల్స్ నెగిటివ్ రివ్యూలు నెగిటివ్ వార్తలు ట్రెండ్ చేస్తూ ఆ సినిమాలు చంపేయకండి ప్లీజ్ "అంటూ చాలా చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు . ఇంతవరకు ఎప్పుడు ఇంత ఎమోషనల్ గా స్పందించలేదు తమన్.
అయితే తమన్ వ్యాఖ్యలపై చిరంజీవి రెస్పాండ్ అయ్యారు . "డియర్ తమన్..నిన్న నువ్వు మాట్లాడిన సందర్భాలు నా హృదయాన్ని తాకేలా చేశాయి . ఎప్పుడు చాలా సరదాగా జోవియల్ గా ఉండే తమన్ ఇంత ఎమోషనల్ గా మాట్లాడేసరికి ఒకింత ఆశ్చర్యం కలగజేసింది. నా మనసుకు చాలా బాధ అనిపించింది . నీ మనసు ఎంత బాధ పడితే నువ్వు ఇలా స్పందించి ఉంటావో అర్థం చేసుకుంటాను . అది ఏ విషయం అయినా సరే సినిమా కావచ్చు ..?క్రికెట్ కావచ్చు..? మరి ఏ అంశమైన సరే ..నెగిటివిటీ అనేది ట్రోలింగ్ అనేది తగ్గించుకోవాలి. ఎవరో అన్నట్టు ..మాటలు ఫ్రీనే కానీ అవి ఎలా ప్రభావితం అవుతాయి అనేది ముఖ్యం. మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని చాలా పాజిటివ్ గా మార్చేస్తుంది "అంటూ చెప్పుకు వచ్చారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమన్ గురించి మాత్రమే మాట్లాడారు .
కానీ ఇదే క్రమంలో బన్నీ ఫాన్స్ ..చిరంజీవి పై మండిపడుతున్నారు . మరి అల్లు అర్జున్ ని అంతలా మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నప్పుడు..? పుష్ప సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు ..?అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. మీ కొడుకు సినిమా విషయం కి వచ్చేసరికి ఇలా రియాక్ట్ అవుతున్నారు. అదే వేరే ఏ హీరో సినిమా అయినా పర్వాలేదా ..?అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. దానికి తగ్గట్టే మెగా ఫాన్స్ కూడా బన్నీ ఫాన్స్ కి కౌంటర్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరొకసారి మెగా వర్సెస్ అల్లు వార్ హీట్ పెంచేసిన్నట్లైంది..!