ఇప్పటివరకు తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలాయి .. కానీ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ కేతికా శర్మ .. 2021 లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత నాగ శౌర్యకు జంటగా లక్ష్యం సినిమాలో కూడా నటించింది ఈ మూవీ కూడా ఆమెకు నిరశ మిగిల్చింది .. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ తేజ్ కు జంటగా రంగ రంగ వైభవంగా, మరో మెగా హీరో సాయిధరమ్ తేజుతో బ్రో సినిమాలో కూడా నటించింది.
టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా కొనసాగింది కేతిక .. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీడిజాస్టర్ అయ్యాయి .. అయితే గత కొన్నాలుగా ఈ ముద్దుగుమ్మ తన తర్వాతి సినిమా ప్రకటించలేదు .. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోలను షేర్ చేస్తుంది .. అటు ట్రెడిషనల్ ఇటు గ్రామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది .. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు అభిమానులు ఫిదా అవుతున్నారు.