పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ సినిమా స్థాయిని షేక్ చేయబోతున్నాడు రాజమౌళి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో సినిమా తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అంటూ అటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే మహేష్ బాబు చేత చాలా చాలా విన్యాసాలే ఈ సినిమాలో చేయించబోతున్నాడట జక్కన్న. మరీ ముఖ్యంగా సినిమాలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుంది అని.. ఆ సీన్ కి మొత్తం థియేటర్స్ షేక్ అయిపోవాల్సిందే అంటున్నారు .
అంతేకాదు ఈ సీన్స్ కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబుని నటింపజేయాలి అంటూ నిర్ణయించుకున్నారట . మొదట అటు ఇటుగా మాట్లాడిన మహేష్ సినిమా కధ ఊపు తెప్పించేసరికి జక్కన్న మాటలకి మెల్ట్ అయ్యి "ఓకే ఎటువంటి డూప్ లేకుండానే చేసేస్తాను " అంటూ హామీ ఇచ్చారట. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. మహేష్ బాబు డూప్ లేకుండానే వైల్డ్ ఫైర్ సీన్స్ లో నటించడం ఒక అందుకు ఆయన కెరియర్ కి ప్లస్ గా మారచ్చు. కానీ అవి చాలా చాలా రిస్కీ ప్రాసెస్ అంటున్నారు జనాలు . అభిమానులు అయితే జక్కన్న పై ఫైర్ అవుతున్నారు . మా మహేష్ చేత ఇలాంటి పనులా..? వాట్ ఈజ్ దిస్ అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!