ఇక ఈ 2025 లో వచ్చే మోస్ట్ అవెటెడ్ సినిమాలు లిస్ట్ ఇప్పుడు భారీగానే ఉంది .. తాజాగా ఈ విషయంలో ఓ సర్వే చేసిన ఐఎండీబీ టాప్ 20 మోస్ట్ అవెటెడ్ సినిమాల రిలీజ్ లిస్టును విడుదల చేసింది .. అయితే ఇప్పుడు ఈ లిస్టులో తెలుగు సినిమాలు వెనుక పడటం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు అసలు లిస్ట్ లోనే కనిపించకపోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఐఎండిబి రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో తెలుగు నుంచి కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి .. ఇక అందులో 6 ప్లేస్ లో ది రాజా సాబ్, 11 ప్లేసులో కన్నప్ప , 20 ఎత్తు ప్లేస్లో తండేల్ సినిమాలు ఉన్నాయి.
మరిన్ని మోస్ట్ క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న అవి లిస్టులో కనిపించకపోవడం మీద ఫిలిం సర్కిల్స్ లో పెద్ద చర్చచ జరుగుతుంది .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు కూడా ఈ సంవత్సరమే రిలీజ్ కానున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాల ట్రైన్స్ భారీగానే కనిపిస్తున్నాయి .. సోషల్ మీడియాలో ఈ సినిమాల ట్రెండ్స్ భారీగానే కనిపిస్తున్నాయి అయినా మోస్ట్ అవైటెడ్ లిస్టులో మాత్రం పవన్ సినిమాలకు ప్లేస్ దక్కలేదు.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర మీద కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న ఐ ఎన్ డి బి లిస్టులో ఈ సినిమా ఎక్కడ కనిపించలేదు .. కేవలం హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఐ ఎన్ డి బి మోస్ట్ అవైటెడ్ లిస్టును తయారుచేసిందని అంటున్నారు సౌత్ ప్రేక్షకులు. ఇక ఈ లిస్టులో...సల్మాన్ సికందర్ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా... టాక్సిక్, కూలీ సినిమాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఏ మాత్రం బజ్ లేని హౌస్‌ఫుల్ 5, బాగీ 4 సినిమాలు టాప్ 5లో ప్లేస్ దక్కించుకున్నాయి ..