గతేడాది డిసెంబర్ నెలలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్,నేషనల్ క్రష్ రష్మికా జంటగా లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ పుష్ప-2.అయితే ఈ మూవీ విడుదలైన మొదటి రోజునుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతున్న  విషయం తెలిసిందే.కాకపోతే ఈ సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇన్సిడెంట్ తో అల్లు అర్జున్ మాత్రం సినిమా విజయాన్ని ఏ మాత్రం ఆస్వాదించలేక పోయారు.అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1830 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెల్సిందే.అయితే 2025 సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్‌లో మూడు ప్రధాన సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ అండ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్,అయితే విడుదల తర్వాత ఈ మూవీ మిక్స్డ్ టాక్ రన్ అవుతుంది.దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకేక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతుంది.అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీనేత్రుత్వంలో  రూపొందిన మూవీ డాకు మహారాజ్.సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకేక్కిన మూవీ వెంకటేశ్ హీరోగా అనీల్ రావిపూడి డైరెక్షన్లో తెరకేక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. 

ఈ మూవీ ఈ సంక్రాంతి సీజన్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.అయితే ఇదే టైంలో ఆ మూడు సినిమాలకు పోటీగా పుష్ప-2 కలెక్షన్స్ పెంచే దిశగా మేకర్స్ కొత్తగా రీలోడెడ్ వెర్షన్ పేరుతొ మరో 20 నిమిషాల నిడివి పెంచి జనవరి 17, 2025న విడుదల చేసారు.అయితే అలా యాడ్ చేసిన కొత్త సన్నివేశాల్లో పుష్ప చిన్నతనంలోని కొన్ని,షికావత్ స్మగ్లింగ్ ఆపరేషన్‌లను పసిగట్టడం అలాగే పుష్ప జపాన్‌లో స్మగ్లర్ను కలవడం వంటి కొన్ని సన్నివేశాలు కలిపారు.అయితే నైజాంలో ఈ రీలోడెడ్ వెర్షన్ టికెట్ ప్రైజ్ సింగిల్ స్క్రీన్లలో రూ.110 మల్టీప్లెక్సుల్లో రూ.150గా ఫిక్స్ చేశారు.అయితే పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ చూసేందుకు సంధ్య థియేటర్ వద్దకు భారీగా బన్నీ అభిమానులు చేరుకొని 'దమ్ముంటే పట్టుకోరా షికావత్' అంటూ నినాదాలు చేస్తున్నారు.అదే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాకపోతే బన్నీ మాత్రం ఇకపై ఇలాంటి వాటికీ రియాక్ట్ అయ్యేది లేదని ఆయన అభిమానులే అంటున్నారు.దీన్ని బట్టి ఇప్పటికి కూడా పుష్పరాజ్ మానియా తెగ్గలేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: