మొదటిరోజు తర్వాత పండగ టైంలో కూడా గేమ్ చేంజర్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు .. అయితే ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే ఊహించని డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది .. ఫుల్ రన్ లో ఈ సినిమా 200 కోట్లు రాబట్టడం కూడా కష్టమనే అంటున్నారు .. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమా తొలి రోజు నుంచి మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది .. ఆ తర్వాత మాత్రం సినిమా కలెక్షన్లు కొంత తగ్గుముఖం పెట్టాయి .. జట్ స్పీడ్ లో 100 కోట్లు వచ్చిన కూడా కంటెంట్ పైన కాస్త మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్లపై ఈ ప్రభావం పడింది. ఇక మరి ముఖ్యంగా గురు, శుక్రవారంలో ఆల్మోస్ట్ కలెక్షన్లు ఒకే విధంగా లేకపోవడం సినిమా టార్గెట్ కు పెద్ద సమస్యగా మారింది .. ఇక రెండో వారంలో కలెక్షన్ లో కొంత వేగం ఉంటే యావరేజ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు .. ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ప్రస్తుతం ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచే అవకాశంం ఉంది .. ఇక ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంతగానో ఆకర్షించి భారీ కలెక్షన్లను రాబట్టింది .. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది .. కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా సత్త ఎంతవరకు ఉంటుందనేది చూస్తే తెలుపుతుంది .. శని , ఆదివారాల్లో బుకింగ్స్ బాగానే ఉన్నాయి .. అయితే సోమవారం నుంచి ఇంతే హడావుడి కనిపిస్తుందో లేదో కూడా చూడాలి .. అయితే ఈ సినిమా మాత్రం 200 కోట్ల మార్క్ కలెక్షన్లను టచ్ చేసి అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సంక్రాంతి సీజన్ వరకు పుష్ప 2 థియేటర్లో ఉండటం . ఇక ఈ సినిమా మరో 20 నిమిషాల అదనపు నిడివి తో టికెట్ రేట్లు తక్కువ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుని రీ లోడ్ వెర్షన్ గా మళ్లీ వచ్చింది .. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ లేదు .. పండగ సెలవుల్లో శుక్రవారం కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్ అందుకోలేకపోయింది.. ఇక చివరిగా సంక్రాంతి సినిమాలు ఈ వీకెండ్ లోనే తెల్చుకోవాల్సిన సమయం వచ్చింది .. శని , ఆదివారం గడిస్తే గాని ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది .