ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎవరి నోట విన్నా పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా ఇదే వినిపిస్తుంది.ఈ క్రమంలో నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు.కానీ సీనియర్ హీరోలు మాత్రం వారి వయసుకు తగిన పాత్రలు చేసుకుంటూ హిట్స్ కొట్టుకుంటూ వెళ్లిపోతున్నారు.అయితే చాలావరకు సీనియర్ హీరోలు ఈ పాన్ ఇండియా స్టార్ అనే గుర్తింపు కోసం ఆశపడడం లేదు. అందులో బాలకృష్ణ కూడా ఒకరు.ఈ నేపథ్యంలోనే మొట్ట మొదటిసారి ఒక పాన్ ఇండియా మూవీలో నటించడానికి  బాలకృష్ణ ఒప్పుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ పనిమీదే ఉన్నారు ఎన్బీకే. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు..? దీనికి దర్శకుడెవరు..? నిజంగానే బాలయ్య అడుగు పెడితే రికార్డులు బద్ధలైపోతున్నాయి. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నారీయన. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు లైఫ్ టైమ్ కలెక్షన్లు 30 కోట్లు రావడం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఫస్ట్ డేనే 30 కోట్లు వసూలు చేస్తున్నాయి.ఇంత మార్కెట్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి. దీనికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్, రజినీకాంత్ కాంబినేషన్‌లో జైలర్ 2 సినిమా తెరకెక్కుతోంది. మూడేళ్ల క్రితం విడుదలయిన జైలర్ మూవీ ఓ రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో కూడా కన్నడ నుండి శివ రాజ్‌కుమార్, మలయాళం నుండి మోహన్ లాల్‌ను క్యామియో కోసం ఒప్పించాడు దర్శకుడు నెల్సన్. ఇప్పుడు సీక్వెల్‌లో గెస్ట్ రోల్ కోసం ఏకంగా బాలయ్యనే ఒప్పించడానికి సిద్ధమయ్యాడట.ఒకవేళ ఇదే ప్లాన్ వర్కవుట్ అయితే మొదటిసారి రజినీకాంత్, బాలయ్యను ఒకే స్క్రీన్‌పై చూడొచ్చని ప్రేక్షకులు ఆతురతగా  ఎదురుచూస్తున్నారు.మరి చూడాలిక ఏం జరగబోతుందో.ప్రస్తుతం బాలయ్య సంక్రాంతి కానుకగా వచ్చిన డాకుమహారాజ్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: