పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో హరిహరవీరమల్లు కూడా ఒకటి. మొదట ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. తాజాగా హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి మాట వినాలి లిరికల్‌ సాంగ్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ‘వీరమల్లు మాట చెబితే వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ఆలపించడం విశేషం. లిరికల్‌ సాంగ్‌లో పవన్‌ కల్యాణ్‌ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక మాట వినాలి పాటకు పెంచల్‌దాస్‌ సాహిత్యం అందించారు. ఇది వరకే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ కాగా ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదిలావుండగా హరి హర వీరమల్లు సినిమా మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. తొలి భాగం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు-1 ది స్వార్డ్ ఈ ఏడాది మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది అన్న సంగతి తేలిసిందే.

అయితే హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబో లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ కూడా మార్చి 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ క్రమంలో నితిన్ మూవీ అప్డేట్ తో హరి హర వీర మల్లు వాయిదా పడుతుందనే వార్తలోస్తున్నాయి.దీంతో పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.అదే జరిగితే రాబిన్ హుడ్ తో పాటు VD12,మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే తేదీ లో విడుదలయ్యే ఛాన్స్ వుంది.ఇక పవన్ కళ్యాణ్ కి భక్తుడిని అని నితిన్ చెప్పుకుంటారు. అంతగా పవన్ ని ఇష్టపడే నితిన్, పవన్ కళ్యాణ్‌తో పోటీపడడానికి సిద్ధపడడం ఆశ్చర్యకరం.ఇక ఈ రెండు చిత్రాలు ఒకే రోజున వస్తాయా, పవన్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉండడంతోనే నితిన్ తన సినిమాని ఈ తేదీకి విడుదల చేస్తున్నాడా అన్నది చూడాల్సి ఉంది.ఇక ఈ సినిమాల మధ్య పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ వస్తాయా అనే సందేహం కూడా ఫ్యాన్స్ కు కలుగుతుంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా థియేటర్లలోకి వస్తుంది ఏ సినిమా ఈ రేసుల నుంచి తప్పుకుంటుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: