బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్  పైన దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఒక దుండగుడు దొంగతనానికి వచ్చి సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో దాడి చేయడం జరిగింది. లీలావతి హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక దొంగ సైఫ్ ఇంట్లోకి చొరబడి డబ్బులు డిమాండ్ చేసి ఆపై దాడి చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సైఫ్ అలీ ఖాన్ వీపు పైన తీవ్రమైన గాయాలు కూడా చేశారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ కు కొన్ని మేజర్ సర్జరీలు కూడా వెన్నెముకకు చేయడం జరిగింది.


తాజాగా సైఫ్ అలీఖాన్ కి సంబంధించి హాస్పిటల్ బిల్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. జనవరి 16వ తేదీన సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ లో చేరగా సైఫ్ ఇంట్లో కాస్ట్లీ కారులు ఉన్నప్పటికీ తన కుమారుడు ఆటోలో ఆసుపత్రికి తరలింప చేశారు. దీంతో వైద్యులు సైఫ్ ని వెంటనే వైద్యం అందించి కత్తిని తొలగించారు అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ బిల్లు రూ.35.95 లక్షల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది ఇందులో ప్రముఖ బీమా కంపెనీ రూ .25 లక్షల రూపాయలు అందించినట్లుగా సమాచారం.


ఈనెల 21వ తేదీన సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ కాబోతున్నట్లు తెలియజేశారు. అయితే అది ఆసుపత్రి బిల్లు కాదా అనేది మాత్రం ఇంకా కచ్చితంగా తెలియలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక ట్విట్టర్ కి సంబంధించి ఫోటో వైరల్ గా మారుతున్నది. మరి అసలు విషయం ఏంటన్నది హాస్పిటల్ బృందం కానీ సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కాని స్పందిస్తుందేమో చూడాలి. ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ కోలుకున్నట్లుగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే సైఫ్ భార్య కరీనాకపూర్ కూడా పలు విషయాలను అభిమానులకు తెలియజేస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: