నెట్ ఫ్లిక్స్ ద్వారా చాలామంది హాలీవుడ్ సిని ప్రముఖులు త్రిబుల్ ఆర్ సినిమాని చూసి ఎన్టీఆర్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు . మరి ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ నటనకు, ఆయన ఎమోషనల్ కంటెంట్ లో ఉన్న ఇంపాక్ట్‌కు అందరూ ఫిదా అయ్యారు.. ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు .. ఇప్పుడు ఇది టాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచింది.. ఇక జేమ్స్ గన్ మాట్లాడుతూ నాకు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉంది.. త్రిబుల్ ఆర్ లోని యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ నటన నా దృష్టిని ఎంతో విశేషంగా ఆకర్షించాయి .. మరీ ముఖ్యంగా జంతువులతో దూకే సీన్ ఎంతో అద్భుతంగా ఉంది .. అందులో అతను అద్భుతంగా కనిపించారు ఒక గొప్ప ప్రాజెక్టుతో ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను అని జేమ్స్ చెప్పటం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది .. జేమ్స్ గన్ హాలీవుడ్ లో గార్డియన్స్ ఆఫ్ ది గాలక్సీ , ది సూసైడ్ స్క్వాడ్ వంటి ఎన్నో గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం ఈ ప్రఖ్యాత దర్శకుడు సూపర్ మాన్ అనే సినిమాను తెర్కెక్కించి రిలీజ్ కు రెడీగా ఉన్నాడు .. ఈ సినిమాపై ప్రపంచ సినిమా లో భారీ అంచనాలే ఉన్నాయి .. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్న ఎన్టీఆర్ తో పని చేయాలని ఆయన చెప్పటం తెలుగులో హిట్ హీరోల స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెంచినట్టే .. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ నుంచి వచ్చే ప్రతి ప్రశంస ఎన్టీఆర్ స్థాయిని మరింత భారీగా పెంచుతుంది .. ఇప్పుడు తెలుగు హీరోలు పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు ద్వారా వచ్చిన ఈ క్రేజ్‌ను ముందుకు తీసుకెళ్తూ నేటి తరం దర్శకులు , నిర్మాతలు మరని గ్లోబల్ ప్రాజెక్టుల కోసం ప్రయత్నించటం గొప్ప విషయమే .. ఎన్టీఆర్ క్రేజ్ హాలీవుడ్ స్థాయి లో పెరగటంతో అతని భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు అందుకోబోతున్నాయని కూడా చెప్పవచ్చు.