అసలే పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని ఆయన పాటలు రీమేక్ చేయడమే కాదు .. ఆయన మేనేరిజం కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో ఫాలో అయిపోతూ ఉంటాడు .. అలాంటి వీర అభిమాని నితిన్ పవన్ పై పోటీకి సై అంటున్నాడా ? పవన్ సినిమాకు పోటీగా తన సినిమాను విడుదల చేస్తాడా ? టాలీవుడ్ లో ఉన్న ఏ హీరో కూడా ఇప్పుడు అలాంటి సాహసం చేయడు నితిన్ అలాంటి పని అస్సలు చేయడు .


ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే .. డిసెంబర్ లో రావాల్సిన రాబిన్ హుడ్ సినిమాను వాయిదా వేసి వచ్చే సమ్మర్ కు పోస్ట్ ఫోన్ చేశారు .. మార్చ్ 28 రిలీజ్ అంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు .. ఇన్ని రోజులు ఈ తేదీ పవన్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా పేరిట ఉంది . ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఆ డేట్ కు రాబిన్ హుడ్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్ ప్రకటించారు .. అంటే ఇప్పుడు దీని అర్థం పవన్ సినిమా వాయిదా పడినట్టే అని కూడా అంటున్నారు .. హరిహర వీరమల్లు చిత్ర యూనిట్‌ను సంప్రదించకుండా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇంత పెద్ద రిస్క్ తీసుకోరు కదా ..

 

ఇక హరిహర వీరమల్లు సినిమాకు ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది .. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీవిజువలైజేషన్ పని నడుస్తుంది .. అది పూర్తి అయిన వెంటనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది .. ఇదే విషయాన్ని పవన్ స్వయంగా ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల షూట్ అంటే మార్చ్ నెలాఖరకు రిలీజ్ చేయడం పెద్ద విషయం కాదు .. అయినప్పటికీ కూడా వాయిదా వేశారంటే ఇంతకంటే ఏదైనా పెద్ద పని ఇంకోటి పెండింగ్లో పడినట్టు అర్థం .. మళ్లీ రీషూట్స్ ఏమన్నా ప్లాన్ చేసి ఉండాలి .. ఇందులో కారణం ఏదైనా హరిహర వీరమల్లు వాయిదా పడటం పక్క అనేది క్లారిటీ వచ్చేసింది .. పవన్ రిలీజ్ డేట్ కి నితిన్ రాబిన్ హుడ్ రావడం మాత్రం ఫిక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: