టాలీవుడ్ సీనియర్ హీరో ... విక్టరీ వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి - ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లు గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ హిట్ సినిమా “ సంక్రాంతికి వస్తున్నాం ” . ఈ సినిమా పై రిలీజ్ కు ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి తో పాటు హీరో విక్టరీ వెంకటేష్ .. టోటల్ సినిమా యూనిట్ వైవిధ్యం గా చేసిన ప్రమోషన్లు సినిమా రేంజ్ ను రిలీజ్ కు ముందు ఎక్కడికో తీసుకు వెళ్లాయి.
ఇక సంక్రాంతి కి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం దూసుకు పోతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఏకంగా 1.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికే కేవలం 3 రోజుల్లోనే రు. 100 కోట్ల వసూల్లు రాబట్టింది. ఈ సినిమా దెబ్బతో ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకీ మామ ఎంత స్ట్రాంగ్ అనేది చూపించింది. ఇక నైజాం మార్కెట్ లో ఈ సినిమా దుమ్ము లేపేసింది.
సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సక్సెస్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్స్ లో భారీ లాభాలు ఇవ్వడం అనేది చాలా అరుదు అని టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది. నైజాంలో అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా నైజాంలో నాలుగో రోజు 2.9 కోట్ల షేర్ ని అందుకొని నాలుగు రోజుల్లోనే ఏకంగా 14.90 కోట్ల షేర్ రాబట్టింది. అది కూడా జిఎస్టీ కాకుండా అందుకొని తన మాస్ జాతర చూపిస్తుంది. ఏదేమైనా ఈ సినిమా దుమ్ము రేపే వసూళ్లు రాబట్టడంతో పాటు వెంకీ మామ కెరీర్ లోనే భారీ వసూళ్లు రాబడుతుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఏం చేస్తుందో ? చూడాలి.