ఇక గతంలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయగా ఇప్పుడు స్పెషల్ అనౌన్స్మెంట్ కి సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది . అలా వైకుంఠపురం వంటి ఇండస్ట్రీ హిట్స్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ .. దీంతో ఇప్పుడు ఈసారి అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు వీరిద్దరూ .. మైథలాజికల్ టచ్ తో భారీ బడ్జెట్ సినిమాకు ఇద్దరూ రెడీ అవుతున్నారు .. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ కు చుక్కలు చూపించడం తో.. ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ఎలా చూపించబోతున్నాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ..
ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చినా సరే ఈ మూవీకి సంబంధించిన చిన్న వీడియోను రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తుంది . మరి తిరువిక్రమ్ కూడా మహేష్ తో గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి మరో సినిమాను ప్రకటించలేదు . గత సంవత్సరానికి పైగా త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు .. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో మరోసారి తాను ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేయాలని గురూజీ గట్టి ప్లానింగ్ తో ఉన్నాడు.