అయితే ఈ సినిమాలో రీలోడెడ్ అంటూ జనవరి 17 నుండి 20 నిమిషాలు యాడ్ చేసిన వెర్షన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి జనవరి 11న ఈ వెర్షన్ ను రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ.. సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది అని కాస్త డిలే చేశారు. అయితే ఈ కొత్త వెర్షన్ లో యాడ్ చేసిన సీన్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
ఇంటర్వెల్ తర్వాత అల్లు అర్జున్, ఫహాద్ మధ్య వచ్చే ఎపిసోడ్ లో కొన్ని అనసూయ చెప్పిన డైలాగ్స్ యాడ్ చేశారు. అలాగే జాతర సీక్వెన్స్ తర్వాత ఫహాద్, సునీల్ కాంబినేషన్ సీన్ యాడ్ చేశారు. వాటితో పాటుగా కొన్ని సీన్స్ కూడా డిలీట్ చేశారు. అలాగే.. పుష్ప జపాన్ వెళ్ళడానికి కారణం ఏంటని ఒక లీడింగ్ సీన్ యాడ్ చేశారు. ట్రైలర్లో చూపించిన జపాన్ రెస్టారెంట్ షాట్ సీన్ కూడా యాడ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా రావు రమేష్ ప్రమాణ స్వీకారం చేసే సీన్, అజయ్ పాత్ర పుష్ప తల్లి కాళ్ల మీద పడి క్షమాపణ కోరే సీన్ యాడ్ చేశారు. పెళ్లికి వచ్చిన పుష్పరాజ్ ని అన్నలిద్దరూ కావలించుకొనే సీన్.. పుష్ప దగ్గరనుండి చిన్నప్పుడు లాక్కున్న చైన్ ను పుష్పరాజ్ మెడలో అజయ్ వేసే సీన్ ఒకటి యాడ్ చేశారు.