మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు వర్ధన్ బాబు గురించి పరిచయం అనవసరం. తాజాగా మంచు విష్ణు సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి పోరాడుతుంటే.. మంచు మనోజ్ మాత్రం వారికి వ్యతిరకంగా ఉన్నాడు. వారి కుటుంబంలో పరస్పరం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా పూటకో గొడవ అవుతున్న వేళ మంచు విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టీఫెన్ పనిచేస్తున్నారు. హిందూ దేవుళ్లకి సంబంధించిన సినిమాకి క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటనే విమర్శలు వస్తున్నాయి. దీనికి మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.
'స్టీఫెన్ అంటే నా దృష్టిలో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ జనరేషన్ వాళ్లు కూడా దేవుడు పాటలు వింటున్నారంటే ఆయన క్రియేట్ చేసిన గణపతి ఆల్బమ్ కారణం. శంకర్ మహదేవన్ పాడిన గణపతి సాంగ్ ‘ఏకదంతాయ వక్రతుండాయ’ను ఆర్గనైజ్ చేసి ఎరేంజ్ చేసింది స్టీఫెన్. కన్నప్ప సినిమాలో శ్రీకాళహస్తి గురించి అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేశారు. ఇక్కడ కావాల్సింది ఎవరు ఎలా పనిచేస్తారని.. ఎంత బాగా చేస్తారని మాత్రమే కావాలి. అంతే తప్ప అతని మతం కాదు' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక మంచు విష్ణు ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత . మంచు రగిలే గుండెలు చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత అతను 2003 తెలుగు యాక్షన్ చిత్రం విష్ణులో నటించాడు. ఆ సినిమాకు గాను అతను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ పురుష అరంగేట్రం గెలుచుకున్నాడు. ప్రస్తుతం 2021 నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: