భారతీయ సినీ సంగీత దర్శకుడు తమన్ అంటే గుర్తుపట్టనివారు ఉండరు. తమన్ సంగీత తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేస్తాడు. ఈయన తొలిచిత్రం రవితేజ నటించిన కిక్, అలాగే తమన్ బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా ఒక పాత్రలో కనిపించాడు. తమన్ పొట్టేపాళెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు. తమన్ నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ తన సంగీతంతో గొప్ప గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈయనకు వెయిలల్లో ఫాన్స్ ఉన్నారు. ఏ సినిమాకు అయిన తమన్  సంగీతం అందిస్తున్నాడు అంటే చాలు ఆ సినిమా ఆల్బమ్ దూసుకుపోవడం ఖాయం.
అయితే తమన్ టాలీవుడ్ హీరో బాలయ్య బాబు నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు మ్యూజిక్ ని అందించారు. తాజాగా డాకు మహారాజ్ ఈవెంట్‌లో తమన్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
తమన్ మాటలకు మెగ స్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా 'నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ.. వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు  నడిపిస్తుంది.' అంటూ రాసుకొచ్చారు.
దానికి తమన్ 'డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన... అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని, కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్ధం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి.' అని రిప్లై ఇచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: