సినీ నటి, బీజేపీ నేత మాధవి లతపై టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు ప్రత్యర్ధులపై విరుచుకుపడే జేసి ఓ హీరోయిన్ ను ఇలా టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తాడిపత్రిలోని మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి స్థానికంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంపై మాధవి లత హాట్ కామెంట్స్ చేసింది. జెసి పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దు అంటూ మాధవి లత అన్నారు. 


అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని మాధవి లత ఆరోపించారు. మాధవి లత వ్యాఖ్యలపై మండిపడ్డ చేసే ప్రభాకర్ రెడ్డి తన నోటికి పని చెప్పడం జరిగింది. అయితే మాధవి లత వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకురాలు, సినీ నటి మాధవి లత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు.


సినిమాలలో నటిస్తున్న మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాధవి లత కోరడం జరిగింది. ఈ మేరకు ఎంఏఏ ట్రేజరర్ నటుడు శివ బాలాజీకి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు మాధవి లత. తాను ఆవేశంలో ఏదో మాట్లాడేశానని, తనకు మహిళలంటే చాలా గౌరవమని జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరాడు.

వయసులో పెద్దవాడినని, కానీ ఎవరిని ఇలా కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ విషయంపై మాధవి లత స్పందిస్తూ తనపై దారుణంగా మాట్లాడాలని, ఇలాంటి పనులు చేస్తే ప్రజలు హర్షించరని మాధవి లత అన్నారు. తనపై జేసీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బదులుగా ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి చర్యలు తీసుకునేలా "మా" కు కంప్లైంట్ ఇచ్చారని సమాచారం అందుతోంది. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: