ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఐశ్వర్య రాజేష్ పేరు మార్మోగిపోతుంది. ప్రతి ఒక్కరు తన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ బ్యూటీకి ప్రస్తుతం వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. దానికి గల ప్రధాన కారణం ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో హీరో వెంకటేష్ కు భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. అంతేకాకుండా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా కామెడీ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా వెంకటేష్ తో ఐశ్వర్య రాజేష్ చేసే కామెడీ సినిమాకే హైలైట్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా చాలా సన్నివేశాలలో ఐశ్వర్య రాజేష్  వెంకటేష్ ను సైతం డామినేట్ చేసింది. అనుమానం, జలసి, ఫీల్ అయ్యే పాత్రలో ఐశ్వర్య రాజేష్ చాలా నేచురల్ గా నటించింది. ప్రియురాలు మీనాక్షి కావడంతో వారిపై వచ్చే అనుమానాలు స్పష్టంగా చిత్రీకరించారు. ఐశ్వర్య రాజేష్ మాటలు, ఎక్స్ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


 ఈ సినిమా విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. దీంతో చిత్ర బృందం సినిమా విడుదలైన సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. సినిమా సక్సెస్ అందుకోవడంతో అందరూ సంతోషంలో కాసేపు ముచ్చటించారు. 


ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. దాంతో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారుతున్నాయి. తిరుపతి గుడి హుండీలో ఎంత డబ్బు వస్తుందో మీకు కూడా అలా డబ్బు రావాలని ఐశ్వర్య రాజేష్ అన్నారు. దీంతో సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవంలో ఐశ్వర్య మాటలకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. సినిమా కలెక్షన్లను తిరుపతి గుడి హుండీతో పోల్చడం ఏంటని కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: