తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి, తమిళ స్టార్ హీరో ధనుష్‌తో సినిమా రూపొదించనున్నారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో తెరపైకి రానుంది. ఈ సినిమాకు హానెస్ట్‌రాజు అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వెంకీ అట్లూరి తదుపరి సినిమా మా బ్యానర్‌లోనే ఉంటుంది. అయితే తెలుగు హీరో కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ హీరో డేట్లు కుదరక పోతే ధనుష్‌తో ప్రాజెక్ట్ రెడీగా ఉంది. దాన్ని మొదలు పెట్టేస్తాము.' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పేరు మీద ఫిల్మ్ ఛాంబర్‌లో హానెస్ట్ రాజు అనే సినిమా టైటిల్ రిజిస్టర్ అయ్యింది. అన్నట్లుగానే ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వెంకీ అట్లూరి ధనుష్‌తో చేసే రెండో సినిమా అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి విశ్వసనీయ సమాచారం త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.