బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి అనే విషయం ప్రస్తుతం మీడియా మొత్తం సంచలనంగా మారింది. అసలు సైఫ్ అలీ ఖాన్ పై ఆ వ్యక్తి కత్తితో ఎందుకు దాడి చేశారు..అని ఎన్నో కోణాల్లో పోలీసులు ఆ నిందితుడిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈరోజు ఉదయం సైఫ్ అలీ ఖాన్ ని కత్తితో పొడిచింది సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తి కాదు అని కొంతమంది వార్తలు వైరల్ చేశారు.అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి పై మరో వార్త చక్కర్లు కొడుతుంది.అదేంటంటే పనిమనిషి తో ఎఫైర్ వల్లే అలా జరిగింది అంటూ జాతీయ మీడియాలో ఓ వార్త వినిపించడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే..బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్  రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. 

మొదట అమృత సింగ్ పెళ్లాడి ఆమెకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత కరీనాకపూర్ ని పెళ్లాడారు. ఇక ఇద్దరు భార్యలకు ఇద్దరి ద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ చాలా రోజుల్ నుండి సౌత్ సినిమాల్లో నెగటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు.అలా స్టార్ హీరో అయినా సైఫ్ ప్రస్తుతం సౌత్ లో కీరోల్స్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఎఫైర్స్ అనేవి చాలా కామన్ గా తీసుకుంటారు. పెళ్ళై పిల్లలున్నా కూడా చాలా మంది సెలబ్రిటీలు వేరే వారితో అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటారు.అలా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి కూడా చాలానే ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయన ఇంట్లో పనిచేసే పనిమనిషితో కూడా సైఫ్ అలీఖాన్ కి ఎఫైర్ ఉన్నట్లు జాతీయ మీడియా ఛానల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి కేసులో ఎన్నో కోణాల్లో పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నారట. అలాగే సైఫ్ పెట్టుకున్న ఇల్లీగల్ ఎఫైర్స్ కారణంగా వేరే వాళ్ళు ఆయన పై పగబట్టి ఈ దాడి చేయించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఎన్నో కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇల్లీగల్ ఎఫైర్స్ అనే మ్యాటర్ బయటపడడంతో చాలామంది నెటిజన్స్ ఇది నిజమేనా..సైఫ్ అలీ ఖాన్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం వల్లే ఆయనపై కత్తి దాడి చేశారా అంటూ చాలామంది  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక సైఫ్ పై ఎందుకు దాడి జరిగిందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: