ఇటీవల మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తండ్రిగా మోహన్‌బాబు.. మనోజ్‌ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గురించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి అని అనేవారు. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు. కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది మా అమ్మ. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్ లు చేసి బాధపడ్డారు' అని చెప్పుకొచ్చాడు.
నేను మనోజ్ కు భయపడి దుబాయ్‌కు షిఫ్ట్ అవవట్లేదు. నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్‌లో చదివించాలనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాం. గోడవలన్నీ పక్కన పెట్టి, కచ్చితంగా మనోజ్ తో కలిసిపోతాను. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి' అని మంచు విష్ణు స్పష్టం చేశాడు.