ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం అయ్యింది. ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి.
అందులో సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. మొదటి నుండి ఇప్పటివరకు ఈ షోలో టాప్ జోడీగా అమర్ దీప్- తేజస్విని కొనసాగుతున్నారు. తెలుగు టీవీ షోలకు సంబంధించి తాజాగా 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. స్టార్ మా ఛానెల్ లో అటు సీరియల్స్ లో, ఇటు షోలలో ఇతర తెలుగు ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటోంది. టీఆర్పీ రేటింగ్స్ లో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలన్నీ తిరుగులేని రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి.
అయితే స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 5లో ఇస్మార్ట్ జోడీ షో టాప్ 1 లో నిలిచి ప్రేక్షకుల మనసు మరోసారి గెలుచుకుంది. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. అయితే తొలి ఎపిసోడే మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి అర్బన్, రూరల్ కలిపి 5.23 రేటింగ్ నమోదు కావడం విశేషం. ఇస్మార్ట్ జోడీ తర్వాత ఇంకా ఏ షోలు టాప్ లో ఉన్నాయో చూడండి.  
ఇస్మార్ట్ జోడీ తర్వాత స్టార్ మాలోనే వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం టాప్ 2 లో ఉంది. ఈ షోకి 3.79 రేటింగ్ నమోదైంది. మూడో స్థానంలో ఈ టీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ 3.67 రేటింగ్ తో నిలిచింది. ఇక ఆ తర్వాత జీ తెలుగులో వస్తున్న సరిగమప 3.02, ఈటీవీలో వచ్చే జబర్దస్త్ 2.38, ఢీ షో 2.26, సుమ అడ్డా 1.40, పాడుతా తీయగా 1.38 రేటింగ్స్ సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: