అనిల్ రావిపూడి దర్శకత్వం వహించినటువంటి ఎలాంటి సినిమా అయినా సరే మంచి విజయాన్ని అందుకుంటుంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిని చూపిస్తారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లోకి వచ్చింది. సినిమా విడుదలైన మొదటి రోజున పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. 


ఆ సంతోషంలో చిత్ర బృందం విజయోత్సవ సభను నిర్వహించారు. ఇందులో చిత్ర బృందం అందరూ పాల్గొన్నారు. కాగా, ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ముందు ఒక మాజీ లవర్ ఉంటుంది. ఆ విషయం తన భార్యకు తెలిసినట్లయితే ఇంట్లో ఉండే గొడవ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా, మాజీ లవర్ పాత్రలో మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించింది. ఐశ్వర్య రాజేష్ తన అమాయకమైన మాటలు, ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంది.


సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతోంది. కాగా, సక్సెస్ మీట్ భాగంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఈ సినిమాలో నలుగురు పిల్లల తల్లిగా తన పాత్ర చాలా బాగుందని చెప్పింది. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం మొదట తనకు మాత్రమే రాలేదని ఇదివరకే ముగ్గురు హీరోయిన్ల వద్దకు ఈ సినిమా స్టోరీ వెళ్ళిందని కానీ వారు నలుగురు పిల్లల తల్లి అనేసరికి ఆసక్తిని చూపించలేదని ఐశ్వర్య రాజేష్ చెప్పింది.


నలుగురు పిల్లల తల్లి పాత్ర అయినప్పటికీ నాకు పెద్ద ఇష్యుల ఏమీ అనిపించలేదని అందుకే నటించానని ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు. ఈ సినిమా విడుదలై మంచి టాక్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నానని ఐశ్వర్య రాజేష్ వెల్లడించింది. ఈ సినిమా విడుదలైన అనంతరం సోషల్ మీడియాలో కొంతమంది నలుగురు పిల్లల తల్లి అంటూ నెగిటివ్ ట్రోల్ చేశారు. కాగా, ఈ సినిమా అనంతరం ఐశ్వర్య రాజేష్ కు వరుసగా సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: