బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో శ్రేయా చౌదరి ఒకరు. బాలీవుడ్ లో ఈ బ్యూటీ తనదైన నటన, అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 2017 సంవత్సరంలో డియర్ మాయ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. అనంతరం బండిష్ బందిపోట్ల సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా చౌదరి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 2023లో కమాండో సినిమాలో నటించింది బ్యూటీ శ్రేయా చౌదరి.

క గత రెండు సంవత్సరాల నుంచి ఈ హీరోయిన్ ఎలాంటి సినిమాలలో నటించలేదు. ఆమెకు సినిమా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. దానికి గల కారణం ఈ బ్యూటీ విపరీతంగా బరువు పెరిగింది. కొన్నాళ్ల నుంచి అధిక బరువు సమస్యతో తాను బాధపడుతోంది. ఈ విషయాన్ని తాజాగా బ్యూటీ శ్రేయా చౌదరి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. 


సోషల్ మీడియాలో శ్రేయా చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటారు. 19 ఏళ్ల వయసులోనే ఆమె విపరీతంగా బరువు పెరిగింది. దీంతో డిస్క్ స్లిప్డ్ సమస్యతో బాధపడిందట. తనను తాను మార్చుకోవడానికి ఎంతగానో కష్టపడిందట. 19 ఏళ్ల వయసులోనే అధికంగా బరువు పెరగడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని శ్రేయా చౌదరి వెల్లడించింది. చిన్న వయసులోనే స్లిప్డ్ డిస్క్ రావడంతో మరిన్ని సమస్యలు వచ్చాయని తెలిపింది బ్యూటీ శ్రేయా చౌదరి.

కానీ 21 సంవత్సరాలు వచ్చేసరికి తాను 30 కిలోల బరువు తగ్గాలని వెల్లడించింది బ్యూటీ శ్రేయా చౌదరి. ఆ తర్వాత తన ఫిట్నెస్, లుక్స్ పై దృష్టి పెట్టినట్లుగా తెలియజేసింది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూ ఉంటుందని శ్రేయా చౌదరి చెప్పారు. వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగాలని శ్రేయా చౌదరి వెల్లడించింది. కాగా, ఈ బ్యూటీ శ్రేయా చౌదరి సినిమాలలో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: