బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వస్తే....1991 జనవరి 12న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించింది. 

పూనేలో లా కోర్స్ పూర్తి చేసిన అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఎన్నో వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. 2014లో విరుట్టు అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. 2017 బిగ్ బాస్ విజేత అభిజిత్ హీరోగా నటించిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగువారిని పలకరించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రగ్యాకు మంచి గుర్తింపు లభించింది. కంచె సినిమా తర్వాత ప్రగ్యా జైశ్వాల్ కు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం, గుంటూరోడు, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత అఖండ-2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ బ్యూటీ సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ప్రగ్యా జైశ్వాల్ కు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

 యూట్యూబ్ ద్వారా సంవత్సరానికి 9 కోట్ల రూపాయలను ప్రగ్యా జైస్వాల్ సంపాదిస్తుందట. నివేదిక ప్రకారం ప్రగ్యా జైస్వాల్ ఆస్తులు ఇప్పటివరకు రూ. 50 కోట్లు ఉన్నట్లుగా వెళ్లడయింది. కాగా, ఈ బ్యూటీ డాకు మహారాజ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో బాలయ్య బాబు సరసన మరోసారి హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. బాలయ్య బాబు నటించిన తదుపరిచిత్రం అఖండ-2. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుందట. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: