తన తండ్రి, భార్య ప్రభావం తన పైన ఎంత ఉందని యాంకర్ ప్రశ్నించగా?..అందుకు అభిషేక్ స్పందిస్తూ 25 ఏళ్లుగా ఇదే ప్రశ్న అందరూ అడుగుతున్నారు తాను దానికి దూరంగానే ఉన్నాను.. మీరు నన్ను తండ్రితో పోలుస్తూ ఉంటే ఉత్తముడుగా పోలుస్తున్నారనే విధంగా అర్థం చేసుకుంటాను.. ఎక్కడో ఒకచోట ఈ గొప్ప పేర్లలో అర్హుడని నమ్ముతాను.. నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా భార్య వారి పట్ల వారి యొక్క విజయాల పట్ల వారు సాధించే విజయాల గురించి తాను ఎప్పుడూ కూడా గర్వపడుతూ ఉంటానని తెలిపారు. మొత్తానికి తన కుటుంబం అందుకున్నటువంటి ఈ ప్రశంసలు తనకు ఆనందం కలిగిస్తున్నాయని తెలిపారు.
తన తండ్రి 82 ఏళ్ల వయసులో ఎంతో శ్రమిస్తూ ఉన్నారని.. తనని కూడా తన మనవరాలు 82 ఏళ్ల వయసులో తన గురించి కూడా చెప్పుకునేలా ఎదగాలనుకుంటున్నానని తెలిపారు అభిషేక్ బచ్చన్. సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కించిన కింగ్ చిత్రంలో షారుఖ్ ఖాన్ తో కలిసి అభిషేకం నటించారు. ఇందులో తండ్రి పాత్రల పోషించారు. ముఖ్యంగా తన కూతురు కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. 2025 చివరిలో రిలీజ్ కాబోతోంది.