తెలుగు సినీ ఇండస్ట్రియల్ లవర్ బాయ్ గా పేరు పొందిన హీరోలలో హీరో నాగశౌర్య కూడా ఒకరు.. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన హీరోగా పేరు సంపాదించారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కంటెంట్ వైజ్ గా మంచి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య నారీ నారీ నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు .కానీ ఇప్పటివరకు ఈ చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ల అయితే కనిపించలేదు.


అయితే నాగశౌర్య మేనత్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగిందట.ఆమె పేరు లత శ్రీ.. యమలీల సినిమాతో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు, జంబలకడిపంబ తదితర చిత్రాలలో నటించిందట లత శ్రీ. సుమారుగా ఈమె అన్ని భాషలలో కలుపుకొని 70 చిత్రాలలో నటించింది. చివరికి జిమ్ ట్రైనర్ ని ప్రేమించి వివాహం చేసుకొని 1999లో ఇండస్ట్రీకి దూరమైందట.


మళ్లీ 2007లో డైరెక్టర్ ఇవివి  దర్శకత్వంలో వచ్చిన అత్తిలి సత్తిబాబు చిత్రంతో రీయంట్రి  ఇచ్చిన పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన లత శ్రీ ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడా బీటెక్ పూర్తి చేశారట. నాగశౌర్య ఫ్యామిలీ తనను అసలు పట్టించుకోరని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. కానీ తనకు మాత్రం తన మేనల్లుడు నాగశౌర్య అంటే చాలా ఇష్టమని అతడు చేసిన సినిమాలన్నీ కూడా చూస్తానంటూ వెల్లడించింది లతశ్రీ. నాగ శౌర్య ఇంట జరిగే  శుభకార్యాలలో ఈమె కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. మొత్తానికి నాగశౌర్య మేనత్త కూడా ఒక నటీ అనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: