బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఆయన రీసెంట్ గా కత్తిదాడికి గురై హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఎలా వివాదంలో ఇరుక్కుంటారని చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ వివాదం ఇప్పటిది కాదు చాలా రోజుల నుండి జరుగుతుందట. మరి ఇంతకీ అసలు వివాదం ఏంటి.. లక్షల మంది సాధువుల తలలు నరకడం ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం మన దేశంలో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ మహా కుంభమేళాలో రోజుకు కోట్లాదిమంది సాధువులతో పాటు సామాన్య ప్రజలు కూడా వచ్చి స్నానాలు ఆచరించి వెళ్తున్నారు.అయితే అలాంటి మహా కుంభమేళ జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ కత్తిదాడికి గురవ్వడానికి అసలు కారణం అదే అంటూ కొంతమంది నెటిజెన్స్ సైఫ్ కత్తి దాడికి మహా కుంభమేళాకి మధ్య లింక్ చేస్తున్నారు. సైఫ్ కరీనాకపూర్ ని పెళ్లి చేసుకున్నాక పుట్టిన ఇద్దరు పిల్లలకి ఒకరికి జహంగీర్ మరొకరికి తైమూర్ అని పేర్లు పెట్టారు. 

అయితే తైమూర్ అని పేరు పెట్టడం వెనుక చాలామంది సైఫ్ ని విమర్శించారు. అంతేకాదు ఆ పేరు వెంటనే తొలగించాలి అని కూడా డిమాండ్ చేశారు. కానీ కరీనాకపూర్ మాత్రం సైఫ్ కి తైముర్ అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ .అందుకే మాకు పుట్టిన అబ్బాయికి తైమూర్ అని పేరు పెట్టాం. అలా ఫ్రెండ్ పేరు పెట్టుకుంటే మా అబ్బాయి ఎప్పటికీ సైఫ్ కి ఫ్రెండ్ లాగే ఉంటాడు అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టామని కరీనా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.కానీ చాలామంది మాత్రం తైమూర్ పేరుపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకంటే 1398లో ఢిల్లీపై దండెత్తి ఢిల్లీని ఆక్రమించిన టర్కో మంగోల్ రాజ వంశీయుని పేరు తైమూర్.. ఈయన యుద్ధ సమయంలో లక్షలాదిమంది సామాన్య జనాలతో పాటు మహా కుంభమేళకి వచ్చిన సాధువుల తలలు కూడా నరికి చంపాడు.

 అలాంటి నీచుడి పేరు భారత దేశంలో పుట్టిన కరీనా సైఫ్ ల సంతానానికి పెట్టడం అస్సలు సరికాదు అని చాలామంది తైమూర్ అనే పేరుని వ్యతిరేకించారు. కానీ ఎవరు ఎంత వ్యతిరేకించినా కూడా కరీనా సైఫ్ లు వెనక్కి తగ్గకుండా తమ కొడుకుకు తైమూర్ అనే పేరు పెట్టారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే.. గతంలో తైమూర్ అనే పేరు పెట్టకండి.. లక్షల మంది సాధువుల తలలు నరికిన వ్యక్తి పేరును మీ కొడుకు ఎలా పెట్టుకుంటారు అని ఎంత చెప్పినా వినకుండా సైఫ్ కరీనాలు తమ కొడుకుకి అదే పేరు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మహా కుంభమేళా జరుగుతూ లక్షలాదిమంది సాధవులు వస్తున్న సమయంలోనే సైఫ్ పై కత్తి దాడి జరిగింది.ఆ పేరు పెట్టినందుకే మహాకుంభమేళా సమయంలో సైఫ్ పై కత్తి దాడి జరిగింది అంటూ చాలామంది నెటిజెన్లు సైఫ్ కత్తి దాడికి అతని కొడుకు పేరుకి మహా కుంభ వేళకి మధ్య లింకప్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: